పోలీసులకు ఏపీ సర్కార్ షాకిచ్చింది. వారి అలవెన్స్‌లలో కోతలు విధిస్తూ జీవో నెంబర్ 79 విడుదల చేసింది. దీని ప్రకారం దిశ సిబ్బందికి ఇప్పటివరకు కేటాయించిన 30 శాతం అలవెన్స్, ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేసే నక్సలిజం స్క్వాడ్ సిబ్బందికి ఉన్న 15 శాతం అలవెన్స్‌ను పూర్తిగా తొలగించింది. ఇక డిప్యూటేషన్‌పై ఏసీబీలో పనిచేస్తున్న వారి 30 నుంచి 25 శాతానికి, ఏసీబీలో నేరుగా రిక్రూట్ అయినవారి అలవెన్స్ 10 నుంచి 8 శాతానికి కుదించింది.