గూడ్స్ రైలు ఇంజిన్ పై కొండచరియలు విరిగిపడటంతో రైలు పట్టాలు తప్పిన ఘటన ఒడిశాలోని అనుగులు జిల్లాలో జరిగింది. నేడు ఉదయం గూడ్స్ రైలు తాల్చేర్ నుంచి సంబల్‌పూర్‌కు బొగ్గులోడుతో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. దీంతో రైల్వే సిబ్బంది రైలుమార్గంలో పడిన బండరాళ్లను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారు. రైల్లో ఉన్న సిబ్బంది సురక్షితంగా ఉన్నట్లు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa