అల్లర్లతో మణిపూర్ అట్టుడుకుతోంది. రాష్ట్రంలో కేవలం మూడు నెలల్లో 30 మంది మిస్సింగ్ అయ్యారు. అందులో మహిళలు కూడా ఉన్నారు. అల్లర్ల నేపథ్యంలో 30 మంది అదృశ్యమైనట్లు ఫిర్యాదులు అందడంతో 6,000కు పైగా ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా ఇంఫాల్‌లో దాదాపు 44 అనాథ శవాలకు ఆగస్టు 3న సామూహిక అంత్యక్రియలు నిర్వహించనున్నారు.