మహారాష్ట్ర ముంబయి విమానాశ్రయంలో మంగళవారం ఘోర ప్రమాదం తప్పింది. ఎయిర్ విస్తారా ఎయిర్ లైన్స్ కు చెందిన విమానాన్ని సామాన్లు తీసుకెళ్లే ట్రక్కు ఢీకొట్టింది. ప్రమాదంలో విమానం ఇంజిన్ దెబ్బతింది. ప్రమాద సమయంలో విమానంలో 140 మంది ప్రయాణికులున్నారు. అయితే, ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. ప్రత్యామ్నాయ విమానంలో ప్రయాణికులను గమ్యస్థానాలకు తరలించినట్లు చెప్పారు.