ఏపీలో మీడియాకు ఉన్నంత స్వేచ్ఛ దేశంలో ఎక్కడా లేదని ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ కే. శ్రీనివాసరావు అన్నారు. బుధవారం ఆయన కడపలో విలేకరులతో ఇంటరాక్షన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. మీడియా స్వేచ్ఛ పేరుతో కొన్ని చానళ్లు, పత్రికలు ప్రభుత్వంపై పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నాయన్నారు. ఇతర రాష్ట్రాల మాదిరి ఏపీలో మీడియాపై నియంత్రణ లేదన్నారు. మీడియాకు స్వేచ్ఛ లేదంటూ ఏపీలో కొన్ని మీడియా ఛానళ్లు వాపోతున్నాయన్నారు.