మహిళా, శిశు సంక్షేమ శాఖపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సమీక్ష చేపట్టారు. గుంటూరు జిల్లా తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం ఏర్పాటు చేశారు. సంక్షేమ శాఖ పనితీరు, పురోగతి గురించి చర్చించనున్నారు. గత సమావేశంలో ఇచ్చిన ఆదేశాల అమలు తీరును సైతం సమీక్ష చేయనున్నారు. ఈ భేటీకి మంత్రి ఉషశ్రీ చరణ్, సంబంధిత శాఖల ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.