జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు మీడియాతో ముఖంగా మాట్లాడుతూ..సీసీఏఏ అర్హత సాధించిన వారికి ఉద్యోగాలు కల్పించాలని , రైల్వే మంత్రిత్వ శాఖ సానుకూలంగా స్పందించాలని.. రైల్వే సాంకేతిక విభాగంలో ఉద్యోగాల కోసం అన్ని అర్హతలు కలిగి, నిర్దేశిత పరీక్షల్లో ఉత్తీర్ణత కలిగిన యువతకు నియామకాలు ఇవ్వకుండా పెండింగ్‌లో ఉంచామని ప్రకటన ఇవ్వడం దురదృష్టకరమన్నారు. 2019లో జారీ అయిన ఉద్యోగ ప్రకటన ఆధారంగా ఈ ఏడాది చేపట్టిన నియామకాలకు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల్లో 400 మందిని పెండింగ్‌లో ఉంచుతూ ప్రకటన ఇవ్వడంతో యువత నిరాశానిస్పృహలకు లోనవుతోందని తెలిపారు. వారి మానసిక వేదనను రైల్వే మంత్రిత్వ శాఖ అర్థం చేసుకొని సానుకూలంగా స్పందించాలని... అర్హులకు ఉద్యోగ అవకాశం కల్పించాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.