అమెరికా నుంచి కేరళకు వచ్చిన ఓ మహిళ సామూహిక అత్యాచారానికి గురయ్యారు. జులై 22న కొల్లంలోని ఓ ఆశ్రమానికి వచ్చిన 44 ఏళ్ల మహిళ జులై 31న ఒంటరిగా సమీపంలోని సముద్రపు ఒడ్డున సేద తీరుతుండగా ఇద్దరు వ్యక్తులు సిగరెట్ ఇవ్వజూపారు. ఆమె దాన్ని తిరస్కరించడంతో మద్యం తాగించి, మత్తులోకి వెళ్లాక సమీపంలోని ఖాళీ ఇంటిలోకి తీసుకుపోయారు. అనంతరం ఆమెపై పలుమార్లు అత్యాచారం చేశారు. పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.