మాచర్ల పట్టణ శివారులోని ఎస్టీకాలనీ ఎర్రగడ్డ ప్రాంతంలో రాత్రివేళ పులిని చూశానంటూ ఓ మహిళ అధికారులకు సమాచారం ఇవ్వడంతో అటవీశాఖ అధికారులు బుధవారం అప్రమత్తమయ్యారు. పట్టణ శివారు ప్రాంతానికి వెళ్లి అక్కడ స్థానికులతో మాట్లాడారు. కాలనీవాసులకు కనిపించింది పులా. లేదా చిరుతా.? అని ఆరా తీస్తున్నారు. ఫారెస్టు బీటు ఆఫీసరు వి. వెంకటేశ్వరనాయుడు ఆ ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa