కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సారధ్యంలో గుంటూరు-నంద్యాల వరకు నిర్వహిస్తున్న రైల్వే డబ్లింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నట్లు సికింద్రాబాద్ రైల్వే సంరక్షణ భద్రతా అధికారి (సీఆర్ఎస్) ప్రణ్జీవ్ సక్సేనా అన్నారు. బుధవారం శావల్యాపురం రైల్వేస్టేషను సందర్శించారు. అనంతరం చీకటిఈగలపాలెం రైల్వే స్టేషనులో 16 కిలోమీటర్ల రైల్వే డబ్లింగ్ పనులకు ప్రారంభోత్సవం చేశారు.