పొన్నూరు మండలంలోని పచ్చలతాడిపర్రు, మన్నవ గ్రామాలలో గురువారం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులు జరిగాయి. గ్రామాల్లో పంట పొలాల కాలవ గట్లు పనులు, కాలువల్లో తూటి కాడ తొలగింపు, చెరువుగట్లు మరమ్మత్తులు పనులు చేపట్టారు. కూలీల మస్టర్లు, కొలతలను టెక్నికల్ అసిస్టెంట్ రత్నరాజు పర్యవేక్షించారు. గ్రామాల్లోని ప్రతి ఒక్కరికి ఉపాధి హామీ పనులు కల్పిస్తామని రత్నరాజు తెలిపారు.