కావలసిన పదార్థాలు
క్యారెట్: రెండు, మెంతి కూర: ఒక కప్పు, పచ్చిమిర్చి: ఎనిమిది, ఎండు మిర్చి: నాలుగు, వెల్లుల్లి రెబ్బలు: నాలుగు, ఆవాలు, జీలకర్ర, మినుపపప్పు, శెనగపప్పు: టీస్పూన్ చొప్పున, కరివేపాకు: ఒక రెబ్బ, నూనె: రెండు టేబుల్ స్పూన్లు, ఉప్పు: తగినంత, బెల్లం: అంగుళం ముక్క.
తయారీ విధానం
ముందుగా క్యారెట్లు, మెంతికూర విడివిడిగా తరిగి పెట్టుకోవాలి. స్టవ్‌మీద కడాయి పెట్టి , నూనె వేడయ్యాక పచ్చిమిర్చి, రెండు ఎండు మిర్చి వేసి.. వేగాక తీసి పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో క్యారెట్ తురుము, మెంతికూర విడివిడిగా పచ్చివాసన పోయేవరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. మిక్సీ గిన్నెలో వేయించిన మిర్చి, క్యారెట్, మెంతికూర, కొంచెం జీలకర్ర, తగినంత ఉప్పు, బెల్లం, వెల్లుల్లి రెబ్బలు వేసి కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు, స్టవ్‌మీద గిన్నె పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, మినుప పప్పు, శెనగపప్పు, వెల్లుల్లి, కరివేపాకు వేసి పోపు బాగా వేగాక గ్రైండ్ చేసుకున్న క్యారెట్ మిశ్రమంలో కలుపుకొంటే క్యారెట్ మెంతి పచ్చడి సిద్ధం.