ఫ్రీ ఫైర్‌లో పరిచయమైన ప్రియుడి కోసం ఓ యువతి బిహార్‌కు వెళ్లింది. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌కు చెందిన 21 ఏళ్ల యువతి తన మొబైల్లో ఫ్రీ ఫైర్ గేమ్ ఆడుతుండేది. ఈ క్రమంలో బిహార్‌కు చెందిన సుజీత్ పరిచయం ఏర్పడింది. ప్రేమలో మునిగిన ఈ జంట పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. యువతి తన ఇంట్లో చదువుకోవడానికి వెళ్తున్నానని చెప్పి బిహార్ వెళ్లిపోయింది. యువకుడు దగ్గరికి వెళ్లి అక్కడి నుంచి వేరే చోటుకు వెళ్లిపోయారు. ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో యువతి కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.