దక్షిణాది రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ ప్రాంతంలో రూ.19,761.8 కోట్లతో పలు జాతీయ రహదారులను నిర్మిస్తున్నట్లు కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ప్రతిపాదించిన ఈ జాతీయ రహదారి ప్రాజెక్టుల్లో 9 నిర్మాణదశలో ఉండగా, 3 ఇంకా ప్రారంభం కాలేదని చెప్పారు. ఇంకా మరో 11 ప్రాజెక్టులు ఈ ప్రాంతానికి మంజూరు అయ్యాయని బుధవారం రాజ్యసభలో వెల్లడించారు. ఇక 2021–26 మధ్య కాలంలో ఎన్‌డీఆర్‌ఎఫ్‌కు రూ.1,60,153 కోట్లు కేటాయించినట్లు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ తెలిపారు.