దేశంలోనే అనంతపురం పేద జిల్లా అని.. తాను నీళ్లు ఇచ్చిన తర్వాతే జిల్లా బాగుపడిందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ప్రాజెక్టుల పర్యటనలో భాగంగా అనంతపురంలో పర్యటించిన ఆయన.. 3 నెలల్లో వైసీపీ ప్రభుత్వం పడిపోతుందన్నారు.ఇక జీవితంలో అధికారంలోకి రాదన్నారు. తమ హయాంలో హంద్రీనీవా సుజల స్రవంతికి రూ.4,182 కోట్లు ఖర్చు చేస్తే.. వైసీపీ ప్రభుత్వం రూ.515 కోట్లే వెచ్చించిందని అన్నారు.