కర్నాటక ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి సిద్దరామయ్య గురువారం ప్రధాని నరేంద్ర మోదీని న్యూఢిల్లీలోని పార్లమెంట్ భవనంలో కలుసుకున్నారు. ప్రధాని మోదీకి పూలమాల వేసి అభివాదాలు తెలియజేసిన సిద్దరామయ్య చందనంతో తయారుచేసిన కళాకృతి, మైసూరు పేట(తలపాగా)ను బహూకరించారు. కాగా కర్నాటకలో ఉచిత హామీ పథకాలపై ప్రధాని విమర్శలకు ప్రతి విమర్శలు చేసిన సిద్దరామయ్య మరుసటి రోజే ప్రధానినిని కలుసుకోవడం విశేషం.