వర్షాల సీజన్ కావడంతో కృష్ణానది పరివాహక ప్రాంతంమైన ఎన్టీఆర్ జిల్లా నందిగామ ప్రాంతం సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వజ్రాల వేటగాళ్లతో సందడిగా మారింది. నిత్యం ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి వందలాదిమంది ఈ వజ్రాల వేటకు వస్తున్నారు. కృష్ణా తీరం వజ్రాల గని గతంతో పోల్చుకుంటే.. ప్రస్తుతం వజ్రాల లభ్యత గణనీయంగా తగ్గినప్పటికీ, వెదికే వారి సంఖ్య మాత్రం తగ్గడం లేదు. కృష్ణానది పరివాహక ప్రాంతంలో వజ్రాల వేట అనాదిగా వస్తున్న సంప్రదాయమే.