గతేడాది నవంబర్ 22వ తేదీన చండ్రుగొండ మండలం, ఎర్రబోడు గుత్తికోయ గ్రామ శివార్లలో విధుల నిర్వహిస్తున్న ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావును విచక్షణా రహితంగా నరికి చంపారు. ఈ మేరకు పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. గురువారం ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జ్ పాటిల్ వసంత్ విచారణ జరిపి జీవిత ఖైదుతోపాటు రూ.1000 జరిమానా విధించారు.