హర్యానాలోని నుహ్ జిల్లాలో హింసాకాండ ఘటనకు సంబంధించి మరో 23 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బుధవారం రాత్రి 23 మందిని అరెస్ట్ చేశామని, దీంతో మొత్తం అరెస్టుల సంఖ్య 139కి చేరినట్లు అధికారులు తెలిపారు. మూడు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని అన్నారు. కాగా నుహ్లో కర్ఫ్యూను కూడా మూడు గంటల పాటు సడలించారు. ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు సడలించినట్లు వెల్లడించారు.