కుప్పం పట్టణంలో గురువారం మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్ జనదిక్ ఆధార్ మెడికల్ స్టోర్ ను ప్రారంభించారు. సుధీర్ మాట్లాడుతూ. అర్జున్ దేశ్పాండే దేశం మొత్తం జనరిక్ ఆధార్ మెడికల్ దుకాణాలను ప్రారంభించారని, నాణ్యమైన జనరిక్ మందులు తక్కువ ధరకు అంటే సుమారు 80 శాతం వరకు తగ్గింపు ధరకి ప్రజలకు అందుబాటులోకి రావడం చాలా గొప్ప అవకాశమని పేర్కొన్నారు. డాక్టర్ కృష్ణ, త్రివిక్రమ్, రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.