ఏపీలోని సర్పంచుల ఆందోళన దేశరాజధాని ఢిల్లీకి చేరింది. ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం కేంద్రం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిసింది. ఈ సందర్భంగా సర్పంచుల సంఘం సభ్యులు 14, 15వ ఆర్థిక సంఘం నిధుల మళ్లింపుపై కేంద్రఆర్థిక మంత్రికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు తెదేపా ఎంపీలతో కలిసి కేంద్రమంత్రికి అన్ని అంశాలను వివరించినట్లు సర్పంచుల సంఘం నేత వైవీబీ వెల్లడించారు.