జగనన్న సురక్ష కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉన్నత సీనియర్ అధికారులతో సహా క్షేత్రస్థాయికి సీఎం జగన్ తీసుకువెళ్లారు అని సజ్జల రామకృష్ణ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.... వైయస్ జగన్ పాదయాత్ర ద్వారా ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకున్నారు. అందుకే బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇవాళ వైయస్ జగన్ వ్యక్తిగా వెళ్లలేనిది ఒక వ్యవస్థను గడప గడపకు తీసుకెళ్తున్నారు. ఆ రోజు ఆయన వెళ్లారు కాబట్టే సమస్యను వివి మానవత్వం ఉన్న వ్యక్తిగా, నాయకుడిగా ఈ సమస్యలను పరిష్కరించారు. ఇప్పుడు అదే మానవత్వంతో మరో ముందడుగు వేశారు అని తెలియజేసారు.