ధర్మవరం మండలం ఓబులనాయన పల్లిలో నూతనంగా నిర్మించబోయే లక్ష్మీనరసింహ దేవాలయ నిర్మాణానికి ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి సతీమణి సుప్రియ గురువారం రూ. 50 వేలు విరాళం ఇచ్చారు. ఈ మొత్తాన్ని ఆమె ఆలయ కమిటీ సభ్యులకు, గ్రామస్తుల సమక్షంలో అందజేశారు. అడిగిన వెంటనే సహాయం చేసిన ఎమ్మెల్యేకి గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa