రాష్ట్రంలో జగనన్న సురక్ష కార్యక్రమం మహా యజ్ఞం లా జరిగిందని అద్దంకి వైయస్సార్ పార్టీ ఇంచార్జ్ బాచిన కృష్ణ చైతన్య అన్నారు. కొరిసపాడు మండలం మేదరమెట్ల గ్రామంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా 95 శాతం మందికి సంక్షేమ పథకాలు అందాయని అన్నారు. రాష్ట్ర మొత్తం మీద కోటి 25 లక్షల మంది సురక్ష కార్యక్రమాన్ని వినియోగించుకున్నారని కృష్ణ చైతన్య తెలిపారు.