సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆలోచన ప్రతి ఒక్కరికి మంచి జరగాలనే ఉంటుందని పురపాలక శాఖ మంత్రి అదిమూలపు సురేష్ అన్నారు. గురువారం ఎర్రగొండపాలెంలోని కల్యాణ మండపంలో తల్లిపాల వారోత్సవాల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గర్భిణీలకు, బాలింతలకు సంపూర్ణ పోషణ అందించేందుకు వైఎస్సార్ సంపూర్ణ పోషణ కిట్లు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. వారి ఆరోగ్యంగా ఉండాలని ఈ కిట్లు అందిస్తున్నట్లు ఆయన అన్నారు.