దేశవ్యాప్తంగా టమాటా ధరలు భారీగా పెరిగాయి. డబుల్ సెంచరీ దాటిన టమాటా ధరలు తగ్గాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. మరికొందరైతే ధరలు తగ్గాలని దేవుళ్లకు ప్రత్యేక పూజలు కూడా చేస్తున్నారు. తమిళనాడులోని నాగపట్టణం జిల్లా కరుకుడి గ్రామ ప్రజలు టమాటా ధరలు తగ్గాలని ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ మరియమ్మన్, నాగమ్మన్ ఆలయంలో ఆడిమాస పౌర్ణమి సందర్భంగా పూజలు నిర్వహించారు. ఈ పూజలో భక్తులు 508 టమాటాలతో దండగుచ్చి దేవుడికి అలంకరించారు.