భారతదేశంలో విద్యను అభ్యసించాలనుకునే అంతర్జాతీయ విద్యార్థుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పోర్టల్‌ను తీసుకొచ్చింది. ‘స్టడీ ఇన్ ఇండియా’ పేరిట తీసుకొచ్చిన ఈ పోర్టల్‌ను విదేశీ వ్యవహారాల శాఖ కేంద్ర మంత్రి ఎస్.జైశంకర్, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రారంభించారు. అంతర్జాతీయ విద్యార్థులను ఆహ్వానిస్తూ భారత్ ప్రపంచ విద్యా కేంద్రంగా మార్చాలన్నదే ‘స్టడీ ఇన్ ఇండియా’ పోర్టల్ ముఖ్య ఉద్దేశమని కేంద్ర మంత్రి జైశంకర్ తెలిపారు.