ఇటీవల సిరియాలో జిహాదీ గ్రూపు హయత్ తహ్రీర్ తో జరిగిన ఘర్షణల్లో ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాన్ అండ్ సిరియా(ISIS) చీఫ్ అబూ అల్ హుస్సేన్ మరణించాడు. ఆయన మరణాన్ని ISIS సంస్థ ధృవీకరించింది. తదుపరి చీఫ్ గా అబి హాఫ్స్ అల్ హషిమి అల్ ఖురేషి నియమితులైనట్లు సంస్థ తెలిపింది. కాగా, 2014లో ఇరాక్, సిరియాలో బీభత్సం సృష్టించి భూభాగాన్ని ఆక్రమించుకున్న ISIS, అనంతరం క్రమంగా బలపడింది. ఇప్పటివరకు నలుగురు చీఫ్ లు హతమయ్యారు.