ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం నుంచి ఎసైన్డ్ భూముల్ని పొంది 20 ఏళ్లు దాటితే వాటిని అమ్ముకునే అవకాశాన్ని కల్పించింది. గవర్నర్ పేరిట ఈ ఆర్డినెన్స్ విడుదలైంది. గత ప్రభుత్వాలు నిరుపేదలకు వేల ఎకరాల భూముల్ని కేటాయించాయి. వాటిని పొందినవారు, వారి వారసులు ఆ భూములను అనుభవించాలి కానీ, అమ్ముకునే హక్కు ఉండేది కాదు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో భూములు పొంది 20 ఏళ్లు దాటితే అమ్ముకునే అవకాశం ఉంటుంది.