ఏపీలో వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న సురక్ష కార్యక్రమం ఒక చరిత్ర సృష్టించిందని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి అన్నారు. దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వమూ అతి తక్కువ సమయంలో అత్యధిక సేవలు అందించే ఇలాంటి కార్యక్రమాలు చేపట్టలేదని గుర్తు చేశారు. గురువారం విజయనగరంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రం మొత్తం 93. 5లక్షలకు పైగా అభ్యర్థులకు అవసరమైన ధ్రువపత్రాలు జారీ చేశామన్నారు.