మణిపూర్ ఘటనలో బాధ్యులను కఠినంగా శిక్షించాలంటూ గురువారం బద్వేలు పట్టణంలో ముస్లిం మైనార్టీ, క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం కూడలిలో మానవహారం ఏర్పడ్డారు. తమ నిరసనను వ్యక్తం చేశారు. శాంతి ర్యాలీలో ప్రజా సంఘాలు, మైనార్టీ సంఘాలు, ముస్లిం మైనార్టీ మహిళలు పాల్గొని సంఘీభావం తెలిపారు.