దేశవ్యాప్తంగా కండ్ల కలక కలకలం సృష్టిస్తోంది. మరీ ముఖ్యంగా ఢిల్లీ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్‌తో పాటు పలు రాష్ట్రాల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో 87,761, బిహార్‌లోని పాట్నాలో 40 వేలు, గుజరాత్‌లో 2.17 లక్షల కండ్ల కలక కేసులు నమోదయ్యాయి. ఢిల్లీ నివాసితులలో 27 శాతం మంది ఈ వ్యాధి బారిన పడ్డారని అధికారులు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లోనూ కండ్లకలక ఆందోళన కలిగిస్తోంది. విజయనగరం జిల్లాలో ప్రతిరోజు వందలాది కేసులు నమోదవుతున్నాయి.