బాలికపై గ్రామ వాలంటీర్ అత్యాచార యత్నానికి పాల్పడిన ఘటన ప్రకాశం జిల్లా దర్శి మండలంలో గురువారం రాత్రి జరిగింది. మండలంలోని ఓ పంచాయికి చెందిన బాలిక(17) ఇంటర్ చదువుతోంది. గురువారం రాత్రి ఆమె తల్లి గ్రామంలోని ఓ వేడుకకు వెళ్లారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికను ఆమె బంధువు, గ్రామవాలంటీర్ అయిన గుంటూరి అశోక్ బలవంతం చేయబోయాడు. బాలిక కేకలు వేస్తూ తప్పించుకుని వెళ్లి తల్లికి చెప్పింది. బాలిక ఫిర్యాదు మేరకు పోలీసులు అశోక్ ను అరెస్టు చేశారు.