మందుబాబులకు కిక్కు దిగేలా న్యాయస్థానంలో తీర్పులు వెలువడుతున్నాయి. ఈ మేరకు కంచరపాలెం ట్రాఫిక్ సిఐ మళ్ళ అప్పారావు కంచరపాలెం ట్రాఫిక్ పరిధి ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుపడ్డ 55 మందిని బుధ, గురు, శుక్రవారం కోర్టులో హాజరుపరచగా వారికి 3వ స్పెషల్ మెట్రోపోలిటన్ మేజిస్ట్రేట్ వై గణపతిరావు రూ. 3వేల నుండి రూ. 10వేల వరకు జరిమాన విధించారు.