విశాఖపట్నం జిల్లాలో ఉన్న విమానాశ్రయం రన్ వే రీ- సర్ఫేసింగ్ పనులు నిమిత్తం 11 గంటలపాటు విమాన రాకపోకలను నిలిపివేస్తున్నట్లు నేవీ ప్రకటించిన సమయాన్ని 8 గంటలకు కుదించాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు డి. పురందేశ్వరి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజానాథ్ సింగ్ కు లేఖ రాశానని ఒక ప్రకటనలో శనివారం తెలిపారు. 11 గంటలపాటు రాకపోకలను నిలిపివేయడంతో 12 సర్వీసులకు అంతరాయం ఏర్పడుతోందని పేర్కొన్నారు.