అమృత్ భారత్ పథకంలో భాగంగా వాల్తేరు రైల్వే డివిజన్ లోని మూడు రైల్వే స్టేషన్లలో అభివృద్ధి పనులు ఈనెల 6న ఆరంభం కానున్నాయని డీఆర్ఎం సౌరబ్ ప్రసాద్ శుక్రవారం మీడియాసమావేశంలో వెల్లడించారు. ప్రధానమంత్రి మోదీ వీడియో కాన్ప రెన్స్ ద్వారా దిల్లీ నుంచి శంకుస్థాపన చేయనున్నారన్నారు. దువ్వాడకు రూ. 26. 31కోట్లు, విజయనగరానికి రూ. 35. 16 కోట్లు, ధమన్ జోడి స్టేషన్ అభివృద్ధికి రూ. 13. 93కోట్లు వెచ్చించనున్నట్లు తెలిపారు.