గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం నిధులు విడుదల చేయాలని వైయస్ఆర్ కడప జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు కొనిరెడ్డి శివచంద్రారెడ్డి కోరారు. శుక్రవారం పంచాయితీరాజ్ శాఖ కమిషనర్ సూర్య కుమారిని కలిసి ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు. 15వ ఆర్థిక సంఘం నిధులు, వృత్తిపన్ను, రిజిస్ట్రేషన్, సర్ చార్జి, తలసరి గ్రాంటు పన్నులను విడుదల చేయాలన్నారు.