రాష్ట్రంలో జరిగే మంచి కార్యక్రమాలకు ప్రతిపక్షాలు, మీడియా సహకరించాలని రాష్ట్ర ఆర్ధిక, ప్రణాళిక, నైపుణ్యాభివృద్ధి శాఖల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ విజయనగరంలో శుక్రవారం సమావేశంలో కోరారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై, ప్రభుత్వం తీసుకుంటున్న రుణాలపై ప్రతిపక్షాలు, ఒక వర్గం మీడియా అవాస్తవాలను ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని పేర్కొన్నారు.