వలిగొండ మండలంలోని వెంకటాపురంలో గల శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ హుండీల్లో భక్తులు సమర్పించుకున్న నగదు, కానుకలను శుక్రవారం లెక్కించారు. నాలుగు నెలల 12 రోజులకు గాను రూ. 14, 46, 646 ఆదాయం సమకూరినట్లు దేవస్థానం ఈఓ మోహన్ బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాదాయశాఖ భువనగిరి డివిజన్ పరిశీలకులు సుమతి, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.