ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో వీలైనంత త్వరలోనే క్యాంటీన్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు శనివారం పేర్కొన్నారు. ఎప్పటి నుంచో వైద్యులు, రోగులు దీనిపై విజ్ఞప్తులు చేస్తున్నారని చెప్పారు. రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులతో కలిసి జడ్పీ ఛైర్మన్ చిన్న శ్రీను చేతుల మీదుగా శుక్రవారం ఆసుపత్రి యాజమన్యానికి వైద్య పరికరాలు అప్పగించారు.