ఒకే ఫొటోతో అనేక సెల్‌ఫోన్ సిమ్‌లు తీసుకున్న సంస్థపై అరండల్ పేట పోలీసులు కేసు నమోదు చేశారు. గుంటూరు పట్టణం బ్రాడీపేటలోని త్రివేణి ఎంటర్ప్రైజెస్ సంస్థ 2020లో ఒకే ఫొటోతో పలు అడ్రస్సులు, ఇతర వివరాలు ఇచ్చి బీఎస్ఎన్ఎల్ సంస్థ నుంచి సిమ్‌లు తీసుకుంది. సంస్థ అధికారులు ఇటీవల ఈమోసాన్ని గుర్తించి శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.