విజయవాడలో ఓ నిరుపేద కుటుంబానికి సీఎం జగన్ అండగా నిలిచారు. వివరాల్లోకి వెళ్ళితే.... శ్రీనివాసరావు-కల్లగుంట శ్యామలాదేవి మధురానగర్‌లో నివాసం ఉంటున్నారు. వీళ్లకు ఓ పాప ఉంది. అయితే 14 నెలల ఆ చిన్నారినిక కంటి క్యాన్సర్ సోకింది. దీంతో స్థానికంగా ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో ఆర్థిక భారం ఎక్కువైపోతుండడంతో సీఎంను కలిసి తమ వ్యథను వినిపించాలనుకున్నారు. ఆప్కాబ్ వజ్రోత్సవ వేడుకలకు ఆయన హాజరవుతున్న సంగతి తెలిసి.. ఏ కన్వెన్షన్ హాల్‌కు వెళ్లారు. ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ శాసనసభ్యులు మల్లాది విష్ణువర్ధన్ దృష్టికి ఈ విషయం వెళ్లడంతో.. ఆయన దగ్గరుండి వాళ్లను సీఎం జగన్ దగ్గరికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన సీఎం, ఆ ఇంటి బిడ్డకు చికిత్స కోసం తక్షణ సాయం అందించాలని అధికారులకు ఆదేశించారు.