పెదకూరపాడు నియోజకవర్గ పరిధిలోని అమరావతి బెల్లంకొండ డబుల్ లైన్ రోడ్డు పనులను ఎమ్మెల్యే నంబూరు శంకరావు శనివారం పరిశీలించారు. త్వరగా రోడ్ల పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అమరావతి మండలం జూపూడి మునగోడు మధ్యలో 149 కోట్లతో రోడ్డును నిర్మిస్తున్నామని వివరించారు. నాణ్యత విషయంలో రాజీపడవద్దని, ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని, వీలైనంత త్వరగా పనులను పూర్తి చేయాలని ఆదేశించారు.