టీడీపీ తోనే రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి అని నియోజకవర్గ పరిశీలకురాలు బి. వందనాదేవి అన్నారు. కాకుమాను మండల పరిధిలోని కొమ్మూరు గ్రామంలో శనివారం టీడీపీ మహాశక్తి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెదేపా అధికారంలోకి వచ్చిన వెంటనే తల్లికి వందనం, ఆడబిడ్డ మహిళలకు సంబంధించి మరెన్నో పథకాల ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి పధంలోకి తీసుకెళ్తామన్నారు.