గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని చేబ్రోలు హనుమయ్య ఫ్యాక్టరీ పరిసర ప్రాంతాలలో అనుమానాస్పదంగా మహిళను విచారించగా తన పేరు బుజ్జి, భర్త పేరు శంకర్ అనీ తమది తిరుపతి అని, తన భర్త తనను ఆటోలో తెచ్చి ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళాడని చెప్పినది. ఆమె రక్షణ దృష్ట్యా ఆమెను వసతి గృహమునకు తరలించామని, ఆమె కుటుంబ సభ్యులను గుర్తించుటకు ప్రయత్నం జరుగుచున్నదని శనివారం పట్టాపురం సిఐ రాజశేఖర్ రెడ్డి తెలియజేశారు.