ఏపీలోని రైల్వే ప్రయాణికులకు అధికారులు గుడ్‌న్యూస్ తెలిపారు. లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్(ఎల్‌టీటీ)తో పాటు స్వర్ణ జయంతి ఎక్స్‌ప్రెస్‌లలను దువ్వాడ రైల్వే స్టేషన్లలో కూడా ఆపాలని నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల దీనికి సంబంధించి రైల్వేశాఖ ప్రకటన చేయగా.. ఇప్పుడు ఎప్పటినుంచి హాల్ట్ కల్పిస్తారనే వివరాలను రైల్వేశాఖ వెల్లడించింది. ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్‌ను ఈ నెల 9 నుంచి, స్వర్ణ జయంతి ఎక్స్‌ప్రెస్‌ను ఈ నెల 10వ తేదీ నుంచి దువ్వాడలో స్టాఫ్ ఉంటుందని రైల్వేశాఖ స్పష్టం చేసింది. ఆ రెండు ట్రైన్లకు దువ్వాడలో హాల్ట్ కల్పించాలనే డిమాండ్లు ఎప్పటినుంచో వినిపిస్తున్నాయి. స్థానిక రైల్వే అధికారులు, ప్రజాప్రతినిధులు రైల్వే బోర్డు ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించారు. గత రెండేళ్లుగా వినతిపత్రాలు సమర్పిస్తూనే ఉన్నారు. దువ్వాడ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, ఇక్కడ హాల్ట్ కల్పించడం వల్ల చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు కూడా ప్రయోజనకంగా ఉంటుందని రిక్వెస్ట్‌లు పంపారు. వీటిని పరిశీలించిన రైల్వే బోర్డు అధికారులు.. ఇటీవల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు.
దువ్వాడలో ఎల్‌టీటీ, స్వర్ణ జయంతి ఎక్స్‌ప్రెస్‌లకు స్టాఫ్ ఇవ్వాలని నిర్ణయించినట్లు బుధవారం రైల్వే బోర్డు జాయింట్ డైరెక్ట్ వివేక్ కుమార్ సిన్హా తెలిపారు. ఎప్పటినుంచి అందుబాటులోకి తీసుకొస్తామనే వివరాలను త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. చర్చలు అనంతరం ఈ నెల 9,10 నుంచి రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లకు హాల్ట్ కల్పించనుడటంతో.. చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తాము వేరే ప్రాంతాలకు వెళ్లడానికి మరింత ఉపయోకరంగా ఉంటుందని చెబుతున్నారు.
విశాఖ ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్(18519) ప్రతి రోజు అందుబాటులో ఉంటుంది. రాత్రి 11.20 గంటలకు విశాఖలో బయలుదేరి విజయవాడ, సికింద్రాబాద్ మీదుగా తర్వాతి రోజు సాయంత్రం 4.15 గంటలకు ముంబైకు చేరుకుంటుంది. ఇక తిరుగు ప్రయాణంలో లోకమాన్య తిలక్-విశాఖ(18520) రైలు ముంబైలో సాయంత్రం 6.55 నిమిషాలకు బయలుదేరి ఉదయం 10.40కు విశాఖకు చేరుకుంటుంది. ఇప్పటివరకు ఈ రైలు పిఠాపురం, సామర్లకొట, రాజమండ్రి, తణుకు, భీమవరం టౌన్, ఆకువీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ రైల్వే స్టేషన్లలోనే ఆగుతుంది.
ఇక విశాఖపట్నం-ఢిల్లీ(12803) రైలు వరంగల్, నాగ్‌పూర్, భోపాల్ మీదుగా ఢిల్లీ వెళుతుంది. ఇప్పటివరకు ఏపీలో సామర్లకొట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడలోనే ఈ ట్రైన్ ఆగుతుంది. ఇప్పుడు ఈ రెండు రైళ్లు దవ్వాడ రైల్వేస్టేషన్‌లో కూడా ఆగనుండటంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇటీవల విశాఖ-సికింద్రాబాద్ మధ్య నడుస్తున్న వందే భారత్ రైలుకు సామర్లకొటలో హాల్ట్ కల్పించిన విషయం తెలిసిందే.