మీరు దాడులు చేస్తుంటే చూస్తూ ఊరుకునే రోజులు పోయాయని. మీరు చేసే ప్రతి దానికి ప్రతిచర్య టీడీపీ వైపు నుంచి ఉంటుందని ధర్మవరం నియోజకవర్గ ఇన్ ఛార్జి పరిటాల శ్రీరామ్ వైసీపీ నీ హెచ్చరించారు. ఈ సందర్భంగా శనివారం ఆయన ధర్మవరంలోని టీడీపీ కార్యాలయంలో పార్టీ నేతలతో కలసి మీడియా సమావేశం నిర్వహించారు. పుంగనూరు, అంగళ్లులో జరిగిన సంఘటనల మీద శ్రీరామ్ తీవ్రంగా స్పందించారు.