చెన్నే కొత్తపల్లి మండలం ఓబులంపల్లిలో టిడిపికి చెందిన బిఎల్ఎ జానకం పల్లి మల్లికార్జునపై అదే గ్రామానికి చెందిన వైసిపి పార్టీ బిఎల్ఎ కిష్టప్ప దాడి చేసినట్లు టీడీపీ నాయకులు శనివారం అధికారులకు ఫిర్యాదు చేశారు. బిఎల్జీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఓటర్ వెరిఫికేషన్లో ఒక వ్యక్తికి రెండు ఓట్లు ఉన్నాయని ప్రశ్నించిన ఆయన పై దాడి చేశారని తెలిపారు. దాడి చేసిన వ్యక్తి పై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరారు.