రాప్తాడు మండలం మరూరు టోల్ ప్లాజా వద్ద మాజీ మంత్రి పరిటాల సునీతను శనివారం పోలీసులు అడ్డుకున్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై దాడిని ఖండిస్తూ రాప్తాడు మండల కేంద్రంలో నిరసన కార్యక్రమానికి హాజరు కావడానికి వెళ్తున్న ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుకు నిరసనగా నడిరోడ్డుపై బైఠాయించిన పరిటాల సునీతతో పాటు టీడీపీ నాయకులను రాప్తాడు పోలీస్ స్టేషన్కు తరలించారు.