రెండవ ప్రపంచ యుద్ధంలో భాగంగా అమెరికా జపాన్ పై అణుబాంబుతో దాడి చేసిన ఘటన జరిగి నేటికి 78 ఏళ్లు అయింది. 1945 ఆగస్టు 6వ తేదీన హిరోషిమా నగరంపై ఉదయం 8.16 నిమిషాలకు అమెరికా యుద్ధవిమానాలు అణుబాంబుతో దాడి చేశాయి. దీంతో క్షణాల్లోనే నగరం బూడిదయిపోయింది. వేల మంది కాలి బూడిదయ్యారు. ఈ ఘటనలో దాదాపు లక్షా 40 వేల మంది మృతిచెందారు. ప్రతి సంవత్సరం ఆగస్టు 6ను 'హిరోషిమా డే'గా ప్రపంచ దేశాలు గుర్తుచేసుకుంటాయి.